ఆర్మీ గుప్పిట్లో బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ హింసాత్మక ఘటనల నేపథ్యంలో పరిస్థితి విషమించింది. దీనితో సైన్యం రంగంలో దిగింది. దేశం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుంది. నిరసనకారులు ఆందోళన విరమించాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్ హెచ్చరికలు జారీ చేశారు. ఆయన ప్రజలనుద్దేంశించి మాట్లాడుతూ త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. హింసామార్గాన్ని విడనాడాలని ఆదేశించారు. ప్రధాని హసీనా రాజీనామా చేసి, భారత్‌లోని త్రిపుర రాజధాని అగర్తలకు చేరుకున్నారని, అక్కడ నుండి లండన్‌కు వెళ్లనున్నారని సమాచారం.

