సెకండ్ ఇన్నింగ్స్‌లో బంగ్లా ఆలౌట్, భారత్ టార్గెట్ ఎంతంటే?
కాన్పూర్‌లో జరుగుతున్న రెండో టెస్టులో చివరి రోజు బంగ్లా జట్టు ఆలౌటయ్యింది. భారత్ ముందు బంగ్లాదేశ్ ఒక మెస్తరు టార్గెట్ పెట్టింది. 95 పరుగులు చేస్తే రెండో టెస్టులో ఇండియా విజయం సాధిస్తుంది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 233 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 146 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇండియా 285/9 పరుగులు వద్ద డిక్లేర్డ్ చేసింది. ఇప్పటికే రెండో టెస్టులో ఎన్నో ప్రపంచ రికార్డులు బద్ధలయ్యాయి. ఇప్పుడు భారత్ చేజింగ్‌లో మరో రికార్డ్ బద్ధలు కొడుతుందేమో చూడాలి.


