Andhra PradeshHome Page Slider

రికార్డు ధర పలికిన బంగినపల్లి మామిడి

బంగినపల్లి మామిడి పళ్లు బంగారు పసుపు రంగుల్లో కనువిందు చేస్తూ ఉంటే  నోరూరని వాళ్లు ఉండరు. ఎంత ఖరీదైనా నాలుగుపళ్లైనా కొనుక్కెళుతూ ఉంటారు. ఈ డిమాండ్‌తోనే బంగినపల్లి ధర రికార్డు స్థాయికి చేరుకుంది. దేశంలోనే పేరు పొందిన ఉలవపాడు బంగినపల్లి మామిడి పండు టన్ను రూ.90 వేలు పలికింది. ఇంత ధర పలకడం ఇదే మొదటిసారి. గత పదేళ్లలో గరిష్టంగా రూ.50 వేలు మాత్రమే పలికింది. దీనితో రైతులు పండుగ చేసుకుంటున్నారు. ఈసారి కాపు తక్కువగా ఉండడం, నాణ్యమైన కాయ దిగుబడి రావడం  కూడా దీనికి కారణం. దీనితో ఇతర రాష్ట్రాల నుండి కూడా వ్యాపారులు దీనిని కొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.