టాలీవుడ్ పై బండ్ల గణేశ్ గుస్సా..
నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ టాలీవుడ్ పై విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి పుట్టినరోజు సందర్భంగా హీరో చిరంజీవి, ఖుష్బూ లాంటి వారు మాత్రమే శుభాకాంక్షలు చెప్పారు. కానీ చాలా మంది ప్రముఖులు సీఎంకు శుభాకాంక్షలు చెప్పలేదు. దీనిపై బండ్ల గణేశ్ స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ‘గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన సినీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు. తెలియజేయడానికి సమయం లేని వారికి పెద్ద నమస్కారం. టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎం కావలెను’ అని పోస్ట్ పెట్టారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని, తెలంగాణ సీఎంవోను ట్యాక్ చేశారు. ఈ పోస్ట్ పై పలువురు కామెంట్లు పెడుతున్నారు.

