Home Page SliderTelangana

“దూకుడు కొనసాగించండంటూ” బండి సంజయ్‌కు బీజేపీ పెద్దల ఫోన్

బండి సంజయ్‌కు జాతీయ బీజేపీ నాయకత్వం అండగా నిలబడింది. నాటకీయ పరిణామాలతో అరెస్టు అయి, విడుదల అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అమిత్ షా, జేపీ నడ్డా, స్మృతి ఇరానీ, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ వంటి బీజేపీ హేమాహేమీలందరూ ఫోన్‌లో పరామర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ మోస పూరిత కుట్రలను చేధిద్దామని, దూకుడును కొనసాగించమని బండి సంజయ్‌ను ప్రోత్సహించారు. జాతీయ బీజేపీ నాయకత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజాసమస్యలపై ఉధృతంగా పోరాడమని కోరుకున్నారు. రేపు ప్రధాని మోదీ హైదరాబాద్ రానున్న సందర్భంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ పార్టీ సమావేశమయ్యింది. ఈ సమావేశంలో బండి సంజయ్ అరెస్టు పరిణామాలు,ప్రధాని మోదీ పర్యటన వివరాల గురించి చర్చించబోతున్నారని సమావేశం. బండి సంజయ్ ఈ రోజు మధ్యాహ్నానికి హైదరాబాద్ రానున్నారు. అనంతరం బీజేపీ ముఖ్యనేతలతో సమావేశమయ్యే అవకాశం ఉంది.