Home Page SliderTelangana

బీజేపీ కార్యకర్తలకు బండి సంజయ్ బహిరంగలేఖ

తెలంగాణా ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా కేసులు పెడుతోందని, బీజేపీ కార్యకర్తలకు బహిరంగలేఖ విడుదల చేశారు బండిసంజయ్. జైలు, కేసులు తనకు కొత్త కాదని, ప్రజల కోసం ఎన్ని సార్లైనా జైలుకు వెళ్లేందుకు సిద్ధమన్నారు. TSPSC పేపర్ లీకును ప్రశ్నించినందుకే తనపై కేసు పెట్టారని, కుట్రపూరితంగానే తనపై కేసు పెట్టారన్నారు. కేసీఆర్‌ను ప్రశ్నించినందుకే తనపై కక్ష కట్టారన్నారు. మోదీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు దేశవ్యాప్తంగా అవినీతి సొమ్మును పంచాలని చూస్తున్నారని మండిపడ్డారు. టెర్రరిస్టులకు మద్దతు నిచ్చే మజ్లిస్‌తో కేసీఆర్ అంటకాగుతున్నారని ఎద్దేవా చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసే కమ్యూనిస్టులతో కలిసి తిరుగుతున్నారని లేఖలో పేర్కొన్నారు.