Home Page SliderTelangana

బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణాలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ నేత బండి సంజయ్ బీఆర్ఎస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబ సభ్యుల పాస్‌పోర్ట్‌లు వెంటనే సీజ్ చేయాలన్నారు.వారి పాస్ పోర్ట్‌లు సీజ్ చేయకపోతే వారు దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉందని బండి సంజయ్ ఆరోపించారు. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ నేతలందరి పాస్‌పోర్ట్‌లు కూడా సీజ్ చేయాలంటూ బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు.