Home Page SliderTelangana

నా జోలికి వస్తే నీ బండారం బయటపెడతా..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కేంద్రమంత్రి బండి సంజయ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. బిడ్డా.. నా జోలికి వస్తే నీ చరిత్ర మొత్తం బయటపెడతానంటూ హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎనికల్లో పోటీ చేయడానికి అభ్యర్థి గతి లేదని ఎద్దేవా చేశారు. ప్రతిసారి కేటీఆర్ నాపై ఏడుస్తూ ఉంటాడు. కాళేశ్వరం కేసులో ఎంక్వైరీ పూర్తయిన కూడా కేసీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయట్లేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్, ఈ-ఫార్ములా వన్, బావమరిది ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ కేసుల్లో కేటీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయట్లేదని రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. ఇప్పుడు కేఆర్ బ్రదర్స్ మీరిద్దరు అయ్యారు…ఈ దొంగ నాటకాలు బంద్ చేయ్.. నీ బతుకెందీ.. నువ్వెందీ.. అంటూ ఫైర్ అయ్యారు.