బండి సంజయ్‌కు జాతీయహోదా
గతంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ స్థానంలో బీజేపీ అధ్యక్షునిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేస్తూ ఆయనకు జాతీయ హోదా కల్పించింది. తాజాగా బండి సంజయ్‌కు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని కేటాయించింది అధిష్టానం. ఈ విషయాన్ని ఖాయపరుస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతవరకూ బండి సంజయ్‌కు ఏ పదవీ కేటాయించలేదని ఆయన అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. దీనితో కాస్త ఊపిరి పీల్చుకున్నట్లయ్యింది. తెలంగాణ రాష్ట్రం నుండి జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ, బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఏపీకి చెందిన సత్యకుమార్ కొనసాగుతున్నారు. కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేసే సమయంలో బండి సంజయ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కిషన్ రెడ్డినైనా తన పని తనను చేసుకోనివ్వమని, ఢిల్లీకి వెళ్లి చెప్పుడు మాటలు చెప్పడం మానుకోవాలని బండి సంజయ్ బీజేపీ వర్గాలకు సూచించారు. దీనితో పార్టీ అంతర్గత కలహాలను బయటపెట్టినట్లయ్యింది.