NewsTelangana

ఆంధ్రప్రదేశ్‌లో జీన్స్‌, టీ షర్టులపై నిషేధం..!

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యార్థులు జీన్స్‌ ప్యాంట్లు, టీ షర్టులు వేసుకోవడంపై రాష్ట్ర డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) నిషేధం విధించింది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థినులు చీర లేదా చుడీదార్లు ధరించాలని స్పష్టం చేసింది. ఎంబీబీఎస్‌, పీజీ వైద్య విద్యార్థులు శుభ్రంగా ఉండే దుస్తులు ధరించాలని.. గడ్డం గీసుకోవాలని సూచించింది. విద్యార్థినులు జుట్టును వదిలేయకూడదని.. వైద్యులంతా స్టెతస్కోప్‌, యాప్రాన్‌ను తప్పనిసరిగా ధరించాలని పేర్కొన్నది. కొందరు విద్యార్థినులు, వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది డ్రెస్‌ కోడ్‌ను పాటించకపోవడంతో ఉన్నతాధికారులు ఈ ఆదేశాలిచ్చారని తెలిపింది. వైద్య సిబ్బందికి ఫేస్‌ రికగ్నైజ్డ్‌ హాజరు విధానాన్ని అమలు చేయాలని బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లకు డీఎంఈ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.