బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంలో ప్రొటోకాల్ రగడ..
బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుగుతోంది. అయితే ఈ కళ్యాణం సమయంలో మంత్రుల ప్రొటోకాల్ రగడ మొదలయ్యింది. పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మిలకు ప్రొటోకాల్ మర్యాదలు అందలేదని అలుక వహించారు. కలెక్టర్ అనుదీప్‌పై మంత్రి పొన్నం మండిపడ్డారు. పొన్నంకు స్వాగతం పలికే సమయంలో తోపులాట కూడా చోటు చేసుకుంది. దీనితో ఆగ్రహించిన ఆయన కొద్దిసేపు గుడిలోకి రాకుండా బయటే కూర్చున్నారు. అనంతరం కాసేపటి తర్వాత అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.ఈ కళ్యాణ మహోత్సవంలో అమ్మవారిని, స్వామివారిని 27 చీరలు, 11 పంచెలతో అలంకారం చేశారు. ఈ కళ్యాణానికి ప్రభుత్వం తరపున మంత్రి కొండా సురేఖ పట్టువస్త్రాలు సమర్పించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా అమ్మవారిని దర్శించుకున్నారు.