బాల్క సుమన్‌ను అరెస్టు చేసిన పోలీసులు
పోచారం శ్రీనివాస్ రెడ్డి తన నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకోగానే బాల్క సుమన్, మరికొందరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. మాజీ మంత్రిని కలవాలని పట్టుబట్టి గేట్లు తోసుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు. బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ ప్రలోభాలకు గురిచేస్తోందని ఆరోపించారు. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.

