బాలినేని తిన్నింటి వాసాలు లెక్కిస్తున్నాడు
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నం పెట్టిన చెయ్యిని నరికేసేలా మాట్లాడుతున్నారని నెల్లూరు జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ ధ్వజమెత్తారు. అమెరికాలోనూ కాక రేపుతున్న ఆదాని వ్యవహారంలో గత వైసీపి ప్రభుత్వాన్ని ముడిపెట్టి జగన్ తప్పు చేశాడని బాలినేని మాట్లాడటాన్ని కాకాణి ఖండించారు. వైఎస్ జగన్ పిలిచి మరీ మంత్రి పదవి ఇచ్చారని అలాంటి వ్యక్తి మీద బురదజల్లడం భావ్యం కాదన్నారు.చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్ ల మెప్పు కోసమే బాలినేని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అయినా ప్రభుత్వం అన్నాక…టేబుల్ ఎజెండా కింద ఎన్నో నిర్ణయాలు తీసుకుంటుంది…దాన్ని కూడా తప్పు బడితే ఎలా…ఈ ఫైలింగ్ సిస్టం ఉన్నా కూడా తెలియకుండా ఫైల్స్ మీద సంతకాలు చేశానని బాలినేని మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు.