బల్దియా కొత్త కమిషనర్ ముందున్న సవాళ్లు
హైదరాబాద్: జిహెచ్‌ఎంసి కమిషనర్ కొత్తగా బాధ్యతలు తీసుకున్న ఆమ్రపాలి ముందు అనేక సవాళ్లున్నాయి. అంతర్గత బదిలీలు, ఇతరత్రా అభివృద్ధి పనులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బల్దియా అప్పుల్లో ఉండడంతో రాబడిని పెంచుకునే మార్గాలపై దృష్టి సారించాల్సి ఉంది. జోనల్ కమిషనర్లను సమన్వయం చేసుకుంటూ పారిశుద్ధ్య వ్యవస్థను గాడిలో పెట్టాల్సి ఉంది. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలను కమిషనర్ చక్కబెట్టాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది.