Home Page SliderNational

బాలయ్య అన్‌స్టాపబుల్‌కు ఏపీ సీఎం

ఆహా ఓటీటీలో వచ్చే సీజన్ 4లో అన్‌స్టాపబుల్ షోకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గెస్ట్‌గా వచ్చారు. ఈ షోకు నటుడు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. గత మూడు సీజన్లలో ఈ షో సూపర్ హిట్‌గా నడిచింది. ఈ కార్యక్రమానికి గతంలో కూడా చంద్రబాబు ఒకసారి గెస్ట్‌గా వచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా రావడంతో ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబుకు పుష్పగుచ్చం అందించి సెట్‌లోకి ఆహ్వానించారు బాలకృష్ణ.