Home Page SliderNational

‘మోక్షజ్ఞ’ కొత్త లుక్‌కు బాలయ్య అభిమానులు ఫిదా

నందమూరి ఫ్యామిలీ నుండి మరో వారసుడు రాబోతున్నాడు. బాలకృష్ణ తనయుడు ‘మోక్షజ్ఞ’ సరికొత్త లుక్‌తో సినిమాలకు సిద్ధమయ్యాడు. ‘హనుమాన్ మూవీ’తో సూపర్ సక్సెస్ సాధించిన యంగ్ డైరక్టర్ ‘ప్రశాంత్ వర్మ’ చిత్రంతో సినిమాలలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గత రెండు రోజులుగా ప్రశాంత్ వర్మ తన యూనివర్స్ నుండి కొత్త తేజం రాబోతోందంటూ హింట్స్ ఇస్తున్నారు. నేడు ‘మోక్షజ్ఞ’ పుట్టినరోజు సందర్బంగా హీరో లుక్‌ను విడుదల చేశారు. తన తర్వాతి చిత్రంలో హీరోగా బాలయ్య వారసుడిని పరిచయం చేయబోతున్నట్లు పేర్కొన్నారు. తాను సూపర్ హీరోల స్టోరీలతో 20 స్క్రిప్ట్‌లు సిద్ధం చేసుకున్నానని ముందే ప్రకటించారు ప్రశాంత్ వర్మ. తేజ సజ్జాతో తీసిన హనుమాన్ సంచలన విజయం తర్వాత ‘జైహనుమాన్’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అనంతరం మోక్షజ్ఞ మూవీ ఉండవచ్చు.