బాలాపూర్ గణేష్ లడ్డూ రికార్డు బ్రేక్..
హైదరాబాద్‌లోని భారీ బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాటకు ఎంతో ప్రసిద్ది అని అందరికీ తెలుసు. ఇక్కడ ఎప్పుడూ రికార్డు స్థాయిలో వేలంపాటలో లడ్డూధర పలుకుతుంది. గతేడాది రూ.27లక్షల రూపాయలు పలికిన లడ్డూ ఇప్పుడు ఎంత రేటు వస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు 2024వ సంవత్సరానికి తన రికార్డును తానే బ్రేక్ చేసుకుని అక్షరాలా రూ.30 లక్షల వెయ్యి రూపాయలు ధర పలికింది. దీనిని ఐదుగురితో పోటీపడి సింగిల్ విండో చైర్మన్ కొలను శంకర్ రెడ్డి దక్కించుకున్నారు. దీని బరువు 21 కేజీలు. ఈవేలం పాట రూ.1116 తో ప్రారంభమయ్యింది.


