Home Page SliderNational

సినీ దర్శకుడు బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్‌లో ఓ సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. బాలయ్య కెరీర్‌లో 109వ సినిమాగా తెరకెక్కుతుండగా మంచి అంచనాలు కూడా నెలకొన్నాయి. మరి నిన్ననే ఈ చిత్ర దర్శకుడు బాబీ పుట్టినరోజు కావున బాలయ్య అయితే తన దర్శకుడు బర్త్ డే వేడుకలు జరిపినట్లు తెలుస్తోంది.

బాబీ ఒక పిక్ షేర్ చేసుకొని తన ఆనందం వ్యక్తం చేశాడు. ఆశీస్సులు, విషెస్ అందించిన నటసింహం బాలకృష్ణకి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని అలాగే నా కుటుంబీకులు, శ్రేయోభిలాషులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అని బాబీ తెలిపారు. ఇలా బాలయ్య, తన ఫ్యామిలీతో కలిసి ఒక పిక్‌ని షేర్ చేశారు. మరి ఈ పిక్‌లో బాలయ్యతో కలిసి వారు అంతా బెస్టాఫ్ లక్ చెబుతున్నట్టుగా థంప్స్ అప్ చూపిస్తూ హ్యాపీ మూమెంట్‌లో కనిపిస్తున్నారు. ఇలా ఈ పిక్ వైరల్‌గా మారింది.