‘ఆదిత్య 369’ సీక్వెల్ గురించి బాలకృష్ణ
నట సింహం బాలకృష్ణ కెరీర్లో ఐకానిక్ మూవీగా నిలిచిన ‘ఆదిత్య 369’ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ కోసం అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవల వారికి బాలకృష్ణ శుభవార్త చెప్పారు. అయితే ఈ చిత్రంలో తాను కాదు, తన కుమారుడు మోక్షజ్ఞ హీరోగా ‘ఆదిత్య 369’కు సీక్వెల్గా ‘ఆదిత్య 999’ రానుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని, త్వరలోనే ఇది పట్టాలెక్కుతుందని వెల్లడించారు. టైమ్ మిషన్, టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన 1991లో రిలీజైన ‘ఆదిత్య 369’ చిత్రంలో బాలకృష్ణ, మోహిని హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి అప్పట్లోనే రూ.కోటిన్నర వరకూ ఖర్చు అయ్యిందట. సీక్వెల్గా తెరకెక్కనున్నఈ చిత్రం అలాగే చరిత్ర సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే ప్రశాంత వర్మ డైరక్షన్లో మోక్షజ్ఞ చిత్రం మొదలు కానున్న సంగతి తెలిసిందే.