ఐబొమ్మ, మూవీరుల్జ్‌లో బలగం మూవీ లీక్
నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బలగం, బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. చిత్రం OTT ప్లాట్‌ఫారమ్‌లలోనూ వచ్చేసింది. భారతదేశ వ్యాప్తంగా మూవీ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రాగా… ఇండియా బయట దేశాల్లోని తెలుగు ప్రజలు వీక్షించేందుకు సిప్లీ సౌంత్ లో ప్రసారమవుతోంది. ఓటీటీ ప్లాట్ ఫార్మ్‌లలో మూవీ విడుదల చేసినప్పటికీ… ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. గ్రామీణ తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి హాస్యనటుడు వేణు దర్శకత్వం వహించారు. బాక్సాఫీసు వద్ద సత్తా చాటిన బలగం, అటు విమర్శకుల ప్రశంసలూ అందుకొంది. ఇటీవలి కాలంలో విడుదలైన మూవీల్లో బాక్సాఫీస్ హిట్‌లలో ఒకటిగా నిలిచింది. ఐతే ఈ మూవీ ఆన్ లైన్‌లో లీకయ్యింది. మూవీ పైరసీ Ibomma, movierulz, tamilrockers, telegram, tamilmv, tamilyogi వంటి పైరేటెడ్ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంది. పైరసీని అడ్డుకునేందుకు పరిశ్రమ పెద్దలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా… కొన్ని మూవీలు మాత్రం వాటి బారిన పడుతూనే ఉన్నాయి.