పాతబస్తీ లో బక్రీద్ పండగ కోలాహలం
హైదరాబాద్: పాతబస్తీలో బక్రీద్ పండగ సందడి మొదలైంది. శనివారం పండగ కావడంతో ‘ఖుర్బానీ’ ఇవ్వటానికి గొర్రెలు, మేకలు, పొట్టేళ్లు కొనుగోలు చేస్తున్నారు. చంచల్‌గూడ జైలు రోడ్డు, మలక్‌పేట ఫైర్‌స్టేషన్ రోడ్డు, అక్బర్‌బాగ్ రహదారులపై వ్యాపారులు గొర్రెల అమ్మకం కేంద్రాలు ఏర్పాటు చేశారు. కశ్మీర్, మహారాష్ట్ర, ఎంపీ, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఏపీ రాష్ర్టాలతో పాటు తెలంగాణలోని నల్లగొండ, మహబూబ్‌నగర్, సంగారెడ్డి కల్వకుర్తి, షాద్‌నగర్ మెదక్ తదితర ప్రాంతాల నుంచి గొర్రెలను భారీగా తరలించారు. గతంలో కంటే ఈసారి పాతబస్తీకి జీవాలు అధిక సంఖ్యలో చేరాయి.