Home Page SliderNational

లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిల్

భూకుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ సహా ఎనిమిది మందికి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇందులో లాలూప్రసాద్ కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వీ యాదవ్ కూడా ఉన్నారు. కాగా వీరిని అదుపులోకి తీసుకోకుండానే ఈడీ చార్జ్ షీట్ దాఖలు చేసినందున తొమ్మిది మందికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఒక్కొక్కరు రూ. లక్ష పూచికత్తు సమర్పించాలని న్యాయ స్థానం సూచించింది. అలాగే బెయిల్ పొందిన నిందితులు అందరూ తమ పాస్ పోర్టులను సరెండర్ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 25కి వాయిదా వేసింది.