బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే కవితకు బెయిల్..
కేటీఆర్, హరీశ్ రావు బీజేపీ నేతల చుట్టూ తిరిగి కవితకు బెయిల్ తెచ్చుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఈ బెయిల్ తో బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలైందని, దీన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. మొన్నటి వరకు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ ను దెబ్బతీయాలని చూశారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు అయ్యి బీజేపీకి బీఆర్ఎస్ దాసోహం అయ్యిందన్నారు. అధికార కాంగ్రెస్ ను, సీఎం రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటవుతున్నాయని మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు.

