పాక్ మాజీ ప్రధానికి బెయిల్
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. కాగా పాకిస్తాన్ సుప్రీంకోర్టు సీఫర్ కేసులో ఆయనకు తాజాగా బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. అయితే పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ప్రస్తుతం 150 కేసులు ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ కేసులో బెయిల్ లభించినా మిగతా కేసుల్లో వారెంట్ ఉన్నందున ఆయనను ఇప్పుడు ఈ బెయిల్‌పై విడుదల చేస్తారా లేదా అనే సందిగ్దం నెలకొంది. కాగా ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన దేశ రహస్యాలను లీక్ చేశారనే ఆరోపణలతో కేసు నమోదైంది. దీంతో ఆయన కొద్ది నెలలుగా జైలులోనే ఉంటున్న విషయం తెలిసిందే.