Home Page SliderNational

ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడికి బెయిల్

దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ స్కామ్‌లో అనుమానితులుగా ఉన్న పలువురిని సీబీఐ విచారించింది. అంతేకాకుండా ఈ కేసులో కీలకంగా ఉన్న వారిని సీబీఐ అరెస్ట్ చేసింది. వారిలో ఏపీకి చెందిన  ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవ కూడా ఉన్నారు. తాజాగా  రాఘవకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలతో ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను ఇచ్చింది. అయితే దీనిపై సీబీఐ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.