Andhra PradeshHome Page Slider

పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు

గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి శుక్రవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా జైల్ నుంచి ఆయన విడుదల కానున్నారు. ఎన్నికల సమయంలో హింసపై ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈవీఎం ధ్వంసంతోపాటుగా, అల్లర్ల కేసులు ఆయనపై పోలీసులు రిజస్టర్ చేశారు. ఆయనను జైల్లో ఉన్నప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కలిశారు.