NationalNews

బాగ్‌మతీ సూపర్ ఫాస్ట్ ట్రైన్‌‌లో చెలరేగిన మంటలు

బాగ్‌మతీ సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఇంజన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే రైల్వే సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ మేరకు బాగ్‌మతీ సూపర్ ఫాస్ట్ ట్రైన్ ‌ను రైల్వే అధికారులు పెద్దప్లలి రైల్వే స్షేషన్‌కు తరలించారు. అనంతరం పెద్దపల్లి రైల్వే స్షేషన్‌ వద్ద దాదాపు 40 నిమిషాల పాటు రైల్వే అధికారులు బాగ్‌మతీ సూపర్ ఫాస్ట్ ట్రైన్‌ను నిలిపివేశారు. అయితే రాఘవాపూర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో బాగ్‌మతీ సూపర్ ఫాస్ట్ ట్రైన్ మైసూర్ నుంచి దర్భంగా వెళుతున్నట్లు సమాచారం.