Home Page SliderInternational

ఐటీ కంపెనీలలో ఉద్యోగాలకు గడ్డుకాలం-ప్రత్యామ్నాయం ఇలా..

ఐటీ కంపెనీలో ఉద్యోగానికి ప్రయత్నించాలనుకొంటున్నారా?.  అయితే కనీసం ఆరునెలలు వేచి చూడాల్సిందే…ఎందుకంటే అంతర్జాతీయంగా ఐటీ రంగం గడ్డు పరిస్థితిలో ఉంది. ఆర్థిక రంగంలో అనిశ్చితి నెలకొంది. అందుకే ఐటీ కంపెనీలు కొత్త నియామకాలపై చాలా ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. బ్యాంకింగ్, బీమా వంటి సంస్థలకు ఆర్థిక సేవలు అందించే ఐటీ కంపెనీలు బ్యాంకింగ్ రంగంలో ఏర్పడిన సంక్షోభాల వల్ల ఆదాయాలను పొందలేకపోతున్నాయి. దీనితో కొన్నాళ్లపాటు హైరింగ్‌కు ఇచ్చే ఆలోచనలతో ఉన్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఇచ్చిన ఆఫర్‌ లెటర్లను కూడా రద్దు చేసే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.

కొవిడ్ సమయంలో బాగా ఊపులో ఉన్న ఐటీ రంగం అధిక వేతనాలతో వర్క్ ఫ్రమ్ హోం విధానంలో కూడా ఐటీ నిపుణులను నియమించుకుంది. అయితే అనంతరం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల పెరిగిన చమురుధరలు అంతర్జాతీయమార్కెట్‌ను దెబ్బతీశాయి. దీనితో అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు కూడా ఉద్యోగాలలో కోత పెట్టిన విషయం మనకు తెలిసిందే. దీనితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకలోకి రావడంతో ఇంకొన్నాళ్లు ఈ అనిశ్చితి కొనసాగుతుందని ఆర్థిక వేత్తలు అంచనాలు వేస్తున్నారు. అధిక వేతనాలు పొందే పైస్థాయి ఉద్యోగులను కూడా తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఐతే ఐటీయేతర రంగాలలో అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. వైద్యం, ఎలక్ట్రానిక్స్, తయారీ, టీచింగ్, జీవశాస్త్రం, పరిశోధనలు, డెలివరీ, డ్రైవింగ్, వంటి రంగాలలో కృత్రిమ మేధ ప్రభావం అంతగా ఉండకపోవచ్చు. దీనితో యువత ఈ రంగాలలో నైపుణ్యం పెంపొందించుకుంటే ఉద్యోగావకాశాలు బాగా పెరిగే అవకాశం ఉంది.