Home Page SliderNational

కొత్త కారు కొనుగోలు చేసేవారికి బ్యాడ్ న్యూస్

మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఇక నుంచి కొత్త కారు కొనేవారు తప్పనిసరిగా కారు పార్కింగ్ స్థలం కూడా కలిగి ఉండాలనే నిబంధనని తప్పనిసరి చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. మహారాష్ట్ర ట్రాన్స్ పోర్టు మంత్రి ప్రతాప్ సర్నాయక్ మాట్లాడుతూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి కారు కొనాలనుకున్నవారు పార్కింగ్ స్థలం తప్పనిసరిగా కలిగి ఉండాలని అన్నారు. ఈ మధ్యకాలంలో ముంబై వంటి మెట్రో పాలిటన్ సిటీలలో సింగిల్ బెడ్ రూం ఇంట్లో ఉంటున్నవారు కూడా కారు కొంటున్నారని, కానీ పార్కింగ్ స్థలం లేకపోవడంతో రోడ్లపై కార్లు పార్క్ చేస్తున్నారని తెలిపారు. దీంతో అంబులెన్స్, ఫైర్ ఇంజిన్స్, ఇతర ఎమర్జెన్సీ వెహికిల్స్ వంటివి వెళ్లాలంటే ఇబ్బంది కలుగుతోందని అందుకే ఈ నిర్ణయం తీసుకోబోతున్నామని అన్నారు. అంతేకాకుండా నగరంలో ట్రాఫిక్ రద్దీని కూడా కంట్రోల్ చెయ్యడానికి వీలుగా ఉంటుందని చెప్పుకొచ్చారు. తాము పేదలు కార్లు కొనకూడదని చెప్పడం లేదని, కానీ కారు కొనేముందు పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేసుకోవాలని మాత్రమే సూచిస్తున్నామని వెల్లడించారు. ఈ పబ్లిక్ పార్కింగ్ అంశంపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మరియు డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే తదితరులతో కలసి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.