Andhra PradeshHome Page Slider

విశాఖలో ఘోర ప్రమాదం- ముగ్గురు దుర్మరణం, ఐదురురికి గాయాలు

విశాఖలోని కలెక్టరేట్ దగ్గరలోని  రామజోగిపేటలో విషాదం జరిగింది. బుధవారం అర్థరాత్రి ఒక మూడంతస్తుల భవనం అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ సమయంలో ఆ భవనంలో 8 మంది ఉన్నారు. వారిలో ముగ్గురు దుర్మరణం చెందగా, ఐదుగురు తీవ్రగాయాలకు గురయ్యారు. మృత్తుల్లో అన్నాచెల్లెలు కూడా ఉన్నారు. పాపం, నిన్ననే మృతుడు సాకేటి దుర్గాప్రసాద్(17) తన జన్మదినవేడుక చేసుకున్నాడు. అతని సోదరి సాకేటి అంజలి (14) కూడా ప్రమాదంలో చనిపోయింది. పిల్లలిద్దరినీ పోగొట్టుకున్న తల్లిదండ్రులు రామారావు, కళ్యాణిలు తీవ్రగాయాలతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. వారి శోకం అక్కడున్న అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక, రెవెన్యూ బృందాలు ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి. బిహార్‌కు చెందిన చోటు(27) అనే వ్యక్తి మృతదేహం కూడా ఈ రోజు ఉదయం వెలికితీశారు. దీనితో మృతుల సంఖ్య 3కు చేరింది. ఈ సంఘటనతో పరిసరప్రాంతాలలో విషాదం అలముకుంది. ప్రజలు భయాందోళనకు కూడా గురవుతున్నారు.