‘వాలంటైన్స్‌డే’కి పోటీగా రికార్డు స్థాయిలో ‘బ్యాచిలర్స్‌డే’
చైనాలో రికార్డు స్థాయిలో జరుగుతున్న ‘బ్యాచిలర్స్‌డే’ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తున్నాయి. ‘వాలంటైన్స్‌డే’కి పోటీగా నవంబర్ 11 నాడు ఈ సింగిల్స్ డేని జరుపుకుంటారు. ఈ సందర్భంగా 20 రోజుల ముందు నుండి అదిరిపోయే రీతిలో వ్యాపారం జరుగుతోంది. అక్టోబర్ 14న మొదలైన ఈ వేడుకలు సుదీర్ఘంగా 25 రోజుల పాటు జరిగి నవంబర్ 11న పూర్తయ్యాయి. గత సంవత్సరం 156 బిలియన్ల వ్యాపారం జరగగా, ఈ ఏడాది దానిని మించి జరిగి ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. దీనిని చైనా చరిత్రలోనే సుదీర్ఘ ‘సింగిల్స్ డే’ వేడుకలుగా చెప్తున్నారు. ఈ వేడుకలు 1993లో మొదలుపెట్టారుట. అప్పటి నుండి నిర్విరామంగా ప్రతీ సంవత్సరం కొనసాగుతున్నాయి. బ్యాచిలర్స్ వారి కోసం ఇష్టమైన వస్తువులు ఎగబడి, పోటీలు పడి కొంటున్నారు. జంటలేని వారి కోసం ఏర్పాటు చేసిన ఈ వేడుకలు బాగా పాపులర్ అయ్యాయి.

