మూడురోజుల్లోనే లాభాల బాట పట్టిన ‘బేబి’
విడుదలైన 3 రోజుల్లోనే ‘బేబి’ చిత్రం సూపర్ హిట్‌గా దూసుకుపోతోంది. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసేస్తోంది. మూడురోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి, సినిమా చిత్ర నిర్మాణ వ్యయాన్ని సాధించేసింది. ఇకపై వచ్చేదంతా లాభమే. కంటెంటే హీరో అంటూ, కథాబలం ఉన్న చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుందని నిరూపించింది ఈ చిత్రం. ఈ చిత్రం ట్రయాంగిల్ లవ్‌స్టోరీ అయినా మ్యూజిక్ హిట్ అవడం, నటీనటుల నటన దీనికి ప్లస్ పాయింట్స్ అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఈ చిత్రం 24 కోట్లు వసూళ్లు చేసిందట. ఈ చిత్రానికి అయిన ఖర్చులు 7 కోట్లు. అయితే వచ్చే వారంలో కనీసం 50 కోట్లు సాధించవచ్చని అంచనాలు వేస్తున్నారు. దీనితో ఈ చిత్ర యూనిట్ అంతా చాలా ఖుషీగా ఉన్నారు.