కోడిగుడ్డు వల్ల పాప మృతి.. లక్షల్లో పరిహారం
గత సంవత్సరం కుప్పంలోని గల్లేపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో పెట్టిన గుడ్డు తిన్న ఒక చిన్నారి మృతి చెందింది. దీనితో బాధిత కుటుంబం మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేయగా, వారు ఈ విషయంలో దర్యాప్తు చేశారు. తప్పు అంగన్‌వాడీ కేంద్రానిదే అని తెలుసుకున్నారు. పాప కుటుంబానికి 8 లక్షలరూపాయలు చెల్లించాలని అగన్‌వాడి కేంద్రానికి, అధికారులకు ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలపై అధికారులు హైకోర్టులో అప్పీలు చేయగా, మానవహక్కుల సంఘ నిర్ణయం సరైనదేనని, బాధిత కుటుంబానికి డబ్బు చెల్లించాల్సిందేనని తీర్పు ఇచ్చింది ఏపీ హైకోర్టు.