కలెక్షన్లలో సరికొత్త రికార్డు సృష్టించిన “బేబి”
వైష్ణవి చైతన్య,ఆనంద్ దేవరకొండ,సిరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నీలం సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన సినిమా బేబి. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. దీంతో విడుదలైన కేవలం 11 రోజుల్లోనే 70కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. అయితే బేబి సినిమా కేవలం 7 కోట్లతో నిర్మించగా..విడుదలైన రెండు రోజుల్లోనే పెట్టుబడిని రాబట్టి నిర్మాతలకు లాభాల పంట పండిస్తోంది. దీంతో బేబి సినిమా విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి మూవీ కలెక్షన్లను బ్రేక్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు అన్న రికార్డును తమ్ముడు బ్రేక్ చేశాడని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. బేబి సినిమాకు ఈతరం యువత బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ఈ సినిమా విడుదలై 10 రోజులు దాటినా క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. ఈ విధంగా బేబి సినిమా భారీ కలెక్షన్లతో నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.

