రాజధానిలో బాబుకు సొంతిల్లు
ఎట్టకేలకు రాజధాని అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు సొంతింటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ ఉదయాన్నే ఇంటి నిర్మాణ పనులకు సీఎం కుటుంబసభ్యులతో కలిసి శంకుస్థాపన చేశారు. గతేడాది డిసెంబరులో వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇటీవలే ప్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. 1,455 చదరపు గజాల విస్తీర్ణంలో జి ప్లస్ 1లో ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు. ఇంటి నిర్మాణ బాధ్యత ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ తీసుకుంది. ఏడాదిలోపు పూర్తి చేసి గృహప్రవేశం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు.

