ఢిల్లీకి వెళ్లొద్దు బాబోయ్
ఢిల్లీని ఎప్పుడూ రాజకీయం కమ్మేస్తూ ఉంటుంది.కానీ రెండేళ్ల నుంచి పొగ కమ్మేస్తూ రాజకీయాన్ని కూడా డామినేట్ చేస్తుంది. అవును ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ పతాక స్థాయికి చేరడంతో చివరకు కోర్టులు కూడా జోక్యం చేసుకుని ప్రభుత్వాలకు మొట్టికాయలు వేయాల్సిన పరిస్థితులు వచ్చాయి.అయినా చర్యలు అంతంత మాత్రంగానే ఉండటంతో ఢిల్లీ వాసులకు తిప్పలు తప్పడం లేదు.దానికి తోడు మంచు అధికమవడంతో జీరో విజిబులిటి ఏర్పడింది. దీంతో ఢిల్లీకి రావాల్సిన దాదాపు 30 విమానాలు రద్దయ్యాయి. మరో 2014 సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసి ఆలస్యంగా నడుపుతున్నారు.అదేవిధంగా దేశ రాజధానికి చేరుకోవాల్సిన అన్నీ రకాల రైళ్ల వేళల్లో కూడా అంతరాయ మార్పులు ఏర్పడ్డాయి. ఈ తరుణంలో ఢిల్లీ వెళ్లే వారికి, అటు నుంచి ఢిల్లీకి వచ్చే వారికి …ఢిల్లీకి వెళ్లొద్దు బాబోయ్ అంటూ హెచ్చరికలు చేస్తున్నారు.

