కాలేజ్ భవనం పై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
తెలంగాణ సూర్యాపేట – చిలుకూరు మండలం గేట్ ఇంజినీరింగ్ కాలేజ్ భవనం పై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని కృష్ణవేణి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు తల్లితోనే హాస్టల్ గదిలో కృష్ణవేణి ఉంది. తెలవారుజామున కాలేజ్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కాలేజ్ యాజమాన్య వేధింపులే ఆత్మహత్యకు కారణమా లేదా కుటుంబ కలహాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కృష్ణవేణి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలానికి చెందింది.

