Breaking NewsHome Page SliderTelangana

బీ.ఆర్‌.ఎస్‌. వినూత్న నిర‌శ‌న‌

రైతాంగానికి సాగు నీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఎండిన వరిపంటను ప్రదర్శిస్తూ బీఆర్‌ఎస్‌ సభ్యులు అసెంబ్లీ, మండలికి వచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరిపంట ఎండిపోతోందని బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా వరిపంట ఎండుతోందని..రైతాంగానికి సాగు నీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు.రైతులు ఆత్మహత్య చేసుకుంటే అందాల పోటీలా అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎండుతున్నయంటే.. ముందుచూపు లేని ప్రభుత్వమే కారణమని ధ్వ‌జ‌మెత్తారు. రైతుల పట్ల, రైతాంగం పట్ల ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయింది కాబట్టే పంటలు ఎండిపోతున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎండిపోయిన ప్రతి ఎకరానికి రూ. 25 వేల రూపాయల చొప్పున పంటల పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతన్నలకు నష్టపరిహారం ఇచ్చేందుకు ఈ బడ్జెట్ లోనే నిధులను కేటాయించాలని కోరారు.