Breaking NewsHome Page SliderTelangana

ఈడి విచార‌ణ‌కు బి.ఎల్‌.ఎన్‌.రెడ్డి

హైద్రాబాద్ మున్సిప‌ల్ డెవ‌ల‌ప్ మెంట్ అథారిటి(హెచ్‌.ఎం.డి.ఏ) మాజీ చీఫ్ ఇంజినీర్ బి.ఎల్‌.ఎన్‌.రెడ్డి ఈడి విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు.బుధ‌వారం ఆయ‌న మాస్క్ ధ‌రించి మీడియాకి మొహం చూపించ‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌ని విధంగా చేతులు అడ్డుపెట్టుకుని కార్యాల‌యంలోకి వెళ్లారు. త‌న‌తో కొన్ని డాక్యుమెంట్స్ ఉన్న ఫైల్ ని తెచ్చుకున్నారు. ఫెమా ఉల్లంఘ‌న‌,మ‌నీలాండ‌రింగ్ కోణంలో ఆయ‌న్ను విచారించ‌నున్న‌ట్లు తెలిసింది.ఆర్ధిక శాఖ‌,ఆర్బీఐ అనుమ‌తులు లేకుండా హెచ్‌.ఎం.డి.ఏ నుంచి అంత పెద్ద మొత్తంలో నిధులు ఎందుకు,ఎవ‌రికి బదిలీ చేయాల్సి వ‌చ్చింద‌నే కోణంలో విచారిస్తున్నారు.