Home Page SliderTelangana

ఈడీ విచారణకు అజారుద్దీన్

హెచ్ సీఏ మాజీ అధ్యక్షుడు కాంగ్రెస్ మాజీ ఎంపీ మహమ్మద్ అజారుద్దీన్ ఈడీ విచారణకు హాజరయ్యారు. హెచ్ సీఏలో రూ.20 కోట్ల మోసం, అవకతవకల వ్యవహారంలో ఇటీవల ఈడీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఇవాళ హైదరాబాద్ లోని ఆ సంస్థ కార్యాలయంలో విచారణకు వచ్చారు. ఈ సందర్భంగా అజారుద్దీన్ మాట్లాడుతూ.. తనపై వచ్చినవి తప్పుడు ఆరోపణలని చెప్పారు. అయితే.. 2020-23 మధ్య కాలంలో హెచ్ సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రూ.3.8 కోట్ల మేర నిధులను దుర్వినియోగం చేశారని ఆయనపై ఈడీ అభియోగం మోపింది.