Andhra PradeshHome Page Slider

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవ ఎన్నిక

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకరుగా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఒక్కరే నామినేషన్ వెయ్యడం, మరెవ్వరూ నామినేషన్ వేయకపోవడంతో అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లయ్యింది. అయ్యన్నపాత్రుడి నామినేషన్‌ దాఖలుకు డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్,లోకేష్ ఇతర మంత్రులు కూడా హాజరవడంతో అతని ఎన్నిక లాంఛనప్రాయమే అని తేలింది. ఆయన ఇప్పటి వరకూ ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుండి సీనియర్ ఎన్టీఆర్‌తో కూడా కలిసి పనిచేశారు. ఇక డిప్యూటీ స్పీకర్ ఎన్నిక రేపు జరగనుంది. ఒకపర్యాయం అనకాపల్లి ఎంపీగానూ, పలుసార్లు రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు.