Home Page SliderTelangana

ఈ ‘పథకం’ కావాలంటే రేషన్ కార్డులో పేరుండాల్సిందే

‘ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన’కు అర్హత పొందాలంటే తెల్లరేషన్ కార్డులో పేరు తప్పని సరి అయ్యింది. ఈ పథకానికి అర్హత ఉన్నవారు కూడా కొందరు దూరమవుతున్నారు. తెలంగాణాలో కొత్త కార్డుల కోసం చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. తమ పిల్లలపేర్లను చేర్చాలని కూడా కొందరు దరఖాస్తులు పెట్టుకున్నారు. కానీ ఏళ్లు గడుస్తున్నా కూడా ప్రభుత్వం కొత్త కార్డులు మంజూరు చేయడం లేదు.

‘ఆయుష్మాన్ భారత్’ కార్డుదారులు దేశంలో ఎంపిక చేసిన కొన్ని ఆసుపత్రులలో ఒకరికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల విలువైన ఉచిత వైద్యసేవలు పొందవచ్చు. ఈ కార్డు ఉంటే దేశంలో ఎక్కడికైనా వెళ్లినా, ఆప్రదేశంలో కార్డుతో అనారోగ్యానికి చికిత్స చేయించుకోవచ్చు. కానీ రాష్ట్రంలోని తహసీల్దార్లు, ప్రభుత్వం మంజూరు చేసినప్పుడే నూతన కార్డుల జారీ ఉంటుందని, వేచి చూడాల్సి ఉంటుందని చెప్తున్నారు. దీనితో ఈ పథకానికి అర్హత ఉన్నా కూడా కొందరు తాత్కాలికంగా దూరం కావాల్సి వస్తోంది.