‘వృద్ధుల కోసం ఆయుష్మాన్ భారత్ స్పెషల్ స్కీం’.. ఇలా అప్లయ్ చేయండి
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సర్కార్ 70 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని విస్తరించింది. వారు ఆదాయంతో సంబంధం లేకుండా ఆయుష్మాన్ భారత్ కార్డు వల్ల ఉపయోగం పొందవచ్చు. దీని ద్వారా దేశంలోని ఏ ఆసుపత్రిలోనైనా రూ.5 లక్షల వరకూ ఉచితంగా వ్యాధులకు చికిత్స పొందవచ్చు. దీనిని చాలా సులభంగా నమోదు చేసుకోవచ్చు. మొబైల్ యాప్ ద్వారా ఆయుష్మాన్ భారత్ కార్డును పొందవచ్చు. ఆధార్ కార్డు సహాయంతో ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం అప్లయ్ చేసుకోవచ్చు. వారు ప్రైవేట్ ఆరోగ్య బీమాను కలిగి ఉంటే కూడా ఈ పథకానికి అర్హులేనని పేర్కొంది. దీనికి ఏ పత్రాలు కావాలి, ఏఏ ఆసుపత్రులలో ఈ చికిత్స లభిస్తుందనేది త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తారు. ఈ కార్డుకు సంబంధించిన సమాచారం పొందాలంటే 14555 అనే టోల్ ఫ్రీ నెంబర్‌కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఢిల్లీ, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో ఈ పథకం అమలులో లేదు. ఎందుకంటే రాష్ట్రప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేయడం లేదు. అందువల్ల ఈ కార్డులు ఇక్కడ పనిచేయవు.

