Home Page SliderNational

సిద్ధమవుతున్న అయోధ్య రాముడి సింహాసనం

బంగారు పూత పూసిన 8 అడుగుల ఎత్తైన సింహాసనంపై అయోధ్యలో రామయ్య కొలువు దీరనున్నారు. 4 అడుగుల వెడల్పైన ఈ పాలరాతి సింహాసనానికి రాజస్థాన్‌లోని శిల్పకళాకారులు మెరుగులు పెడుతున్నారు. అయోధ్య రామాలయ ట్రస్ట్ వెల్లడించింది. వచ్చే నెల 15 కల్లా ఇది ఆలయానికి చేరుకుంటుందని తెలిపింది. ఇక  ఈ నెల 5న గుడిలో అక్షింతలతో పూజ చేస్తారు. ఆ అక్షింతల్ని దేశవ్యాప్తంగా ఉన్న రామభక్తులకు పంపిణీ చేయడం జరుగుతుందని ట్రస్ట్ తెలిపింది.