Home Page SliderTelangana

దసరా మూవీ డైరక్టర్‌కి అదిరిపోయే BMW కార్ గిఫ్ట్

దసరా మూవీ డైరక్టర్‌కి లక్కీఛాన్స్ దక్కింది. తన మొదటి చిత్రంతోనే డైరక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు శ్రీకాంత్ ఓదెల. ఈ సినిమా త్వరలో 100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టబోతోంది.  ఈ సినిమా విజయోత్సవసభ కరీంనగర్‌లో జరిగింది. యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సినిమాను సూపర్ బ్లాక్ బ్లస్టర్ హిట్ చేసినందుకు ఈ సినిమా నిర్మాత చెరుకూరి సుధాకర్‌, డైరక్టర్ శ్రీకాంత్‌కు  BMW కార్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. అలాగే సినిమా కోసం పనిచేసిన వారందరికీ 10 గ్రాముల గోల్డ్ కాయిన్స్‌ను కూడా ఇచ్చారు. ఈ సభలో యాంకర్ సుమ, హీరో నానితో కలిసి డ్యాన్స్ కూడా చేశారు.