Andhra PradeshHome Page Slider

అవినాశ్‌కు సుప్రీంలో ఎదురుదెబ్బ

వివేకా హత్యకేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌కు సుప్రీం కోర్టు ససేమిరా ఒప్పుకోలేదు. సీబీఐ అరెస్టు చేయకుండా అవినాశ్‌ను రక్షించలేమని పేర్కొంది. హైకోర్టు వెకేషన్ బెంచ్‌లో ఈనెల 25న విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఉన్న విపక్షాలు కూడా తమ వాదనలు హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు వినిపించాలని పేర్కొంది. సీబీఐ ఎందుకు అవినాశ్‌ను అరెస్టు చేయకుండా ఉపేక్షిస్తోందని ప్రశ్నించింది. ఇప్పటికే మూడుసార్లు సీబీఐ విచారణకు గైర్హాజరైన అవినాశ్ రెడ్డి తన తల్లి అనారోగ్యం కారణంగా కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో ఉన్న సంగతి తెలిసిందే. వైసీవీ వర్గాలు, ఆయన అనుచరులు ఆసుపత్రి పరిసరాలు ఆక్రమించి, సీబీఐను అడ్డుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కాగా సీబీఐ కర్నూలు ఎస్పీతో పలుమార్లు భేటి అయ్యి, అవినాశ్ రెడ్డిని లొంగిపొమ్మని ఆదేశాలు ఇమ్మని విజ్ఞప్తి చేస్తున్నారు.