మనీష్ సిసోదియా స్థానంలో అవధ్ ఓజా..
వచ్చే సంవత్సరం ఆరంభంలో ఢిల్లీకి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తోంది. తన తొలి జాబితాను ఇప్పటికే విడుదల చేసింది ఆప్. ఇప్పుడు తాజాగా రెండవ జాబితాను విడుదల చేసింది. అయితే మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోదియా స్థానాన్ని మరొకరికి కేటాయించింది. ఆయన పోటీ చేసే పటపఢ్ గంజ్ స్థానాన్ని ఇటీవలే ఆప్‌లో చేరిన ప్రముఖ యూపీఎస్‌సీ ఎగ్జామ్స్ కోచ్ అవధ్ ఓజాకు కేటాయించింది. సిసోదియాకు జంగ్ పురాను కేటాయించారు. మనీష్ 18 నెలల పాటు మద్యం కుంభకోణం కేసులో తిహార్ జైలులో గడిపారు. గత ఆగస్టులోనే ఆయన విడుదలయ్యారు. అలాగే అధినేత కోజ్రీవాల్ కూడా ఇదే కేసులో జైలుకు వెళ్లి వచ్చారు. మళ్లీ ఎన్నికలలో గెలిచే ముఖ్యమంత్రిగా ఉంటానని పేర్కొన్న కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసి, ఆప్ నేత ఆతిశీని ముఖ్యమంత్రిగా చేసిన సంగతి తెలిసిందే.