IPL కామెంటేటర్‌గా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్‌ను ఈసారి IPLలో ఏ జట్టు కొనుగోలు చేయలేదు. దీంతో ఈసారి స్మిత్ IPLకు దూరమయ్యాడని అందరు అనుకున్నారు. అయితే తాజాగా స్మిత్ మాత్రం తాను IPLలో పాల్గొంటున్నానని ఓ వీడియో విడుదల చేశారు. మరి ఏ జట్టు కొనుగోలు చేయకపోతే ఎలా పాల్గొంటున్నాడు అని అనుకుంటున్నారా? అతడు ఈసారి IPLలో ఆటగాడిలా కాకుండా కామేంటేటర్‌గా పాల్గొనబోతున్నాడు. ఈ విషయాన్నే అతడు తాజాగా విడుదల చేసిన వీడియోలో “నమస్తే..నేను ఈ ఐపీఎల్‌లో జాయిన్ అవుతున్నా” అని తెలియజేశాడు. కాగా స్మిత్ ఈసారి కామేంటేటర్ అవతారంలో మెప్పించనున్నాడని తెలుస్తోంది. ఈసారి ఐపీఎల్ వేలంలో ఇతని ధర రూ.2కోట్లు పలుకగా ఎవరు కొనలేదు.