InternationalNews Alert

ఆస్ట్రేలియా కెప్టెన్ ఫించ్ సంచలన నిర్ణయం

ఆస్ట్రేలియా క్రికెట్​ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్​ అవుతాడా లేదా అనే విషయంపై ఫించ్​ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ రోజు ఉదయం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించాడు. ఆస్ట్రేలియా తరఫున రికీ పాంటింగ్, డేవిడ్ వార్నర్​ తర్వాత అత్యధిక స్కోరు చేసిన ఆటగాడుగా ఆరోన్ ఫించ్ క్రికెట్​ అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు. ఫించ్ తన వన్డే కెరియర్‌లో ఇప్పటివరకు 17 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు చేశాడు

కాగా కెప్టెన్‌గా జట్టును విజయాల బాటలో నడిపిస్తున్న ఫించ్‌.. గత కొంత కాలంగా వ్యక్తిగత ప్రదర్శనలో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. చివరి ఏడు వన్డే ఇన్నింగ్స్‌లలో 26 పరుగులు మాత్రమే చేశాడు. వాటిలో రెండు డకౌట్‌లు కూడా ఉన్నాయి. ఫించ్‌ సారథ్యంలోనే తమ తొలి టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ను ఆస్ట్రేలియా జట్టు కైవసం చేసుకుంది.