Home Page SliderNews

ఆస్ట్రేలియా టార్గెట్ 76, ఇండియా టార్గెట్ 10 వికెట్లు

ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓటమి తప్పించుకోవడం అసాధ్యంగా కన్పిస్తోంది. ఆస్ట్రేలియా ముందు టీమ్ ఇండియా 76 పరుగులు విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. మొదటి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకు ఆలౌటైన భారత్ ఆటగాళ్లు రెండో ఇన్నింగ్స్‌లోనూ పేలవమైన ప్రదర్శనతో చికాకు పెట్టారు. 163 పరుగులకే ఆలౌటై.. అభిమానులను నిరాశపర్చారు. చటేశ్వర పూజారా 59 పరుగులు మినహా చెప్పుకోదగ్గ ఆట ఒక్కరు కూడా ఆడలేదు. శ్రేయస్ అయ్యర్ 26 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఇక ఆస్ట్రేలియా స్పిన్ బౌలర్ నాథన్ లియాన్ 8 వికెట్లు పడగొట్టి భారత్ టాప్ ఆర్డర్ వెన్నువిరిచాడు. రెండు రోజుల్లో 30 వికెట్లు పడటం కూడా సంచలనమని చెప్పాలి. మూడో రోజు ఏదైనా అద్భుతం జరిగితే తప్పించి ఇండియా గెలవడం దాదాపు అసాధ్యం. సైంటిఫిక్ ఈక్వేషన్ ఆధారంగా ఆస్ట్రేలియా గెలిచేందుకు 80 శాతం అవకాశం ఉండగా, ఇండియా గెలిచేందుకు కేవలం 20 శాతం అవకాశమున్నట్టుగా ఎక్స్‌పర్ట్స్ విశ్లేషిస్తున్నారు. నాలుగు టెస్టుల సీరిస్‌లో మొదటి రెండు టెస్టుల్లో విజయం సాధించిన ఇండియా ఈ మ్యాచ్‌లో గెలిస్తే టెస్టు ఛాంపియన్ షిఫ్ ఫైనల్‌కు అర్హత సాధించగలుగుతుంది.